Thoughting.in
ENతె

StoriesRomanceరాత్రికి చెప్తా

Part 5 of 6 · 1 minమూడో రాత్రి

పెళ్లి కాక ముందు దాకా ఇవంతా కుళ్లు జోకులు, కానీ ఒక్కసారి ఆ బాంధవ్యాన్ని అనుభవించి, తనను ఆ స్థానం లో ఊహించుకుంటేనే ఆ మాటల్లో ప్రేమ, ఆ ప్రేమ లో లోతు తెలుస్తుంది.

ఇప్పుడు లాస్యకి కొంచం కోపంగా, కొంచం బాధగా ఉంది. తప్పు తనదే అయినా, తనను మెచ్చుకున్నారు, అనవసరంగా ప్రమోద్ అనిపించుకుంటున్నాడు.

“సారీ అండి ” అంది లాస్య తడి తగిలిన కళ్ళతో. “అర్థం అయ్యిందిలే, రాత్రికి చెప్తా “ అని లాస్య తల నిమిరాడు. వెంటనే కొత్త సందేహం, “రాత్రికి చెప్తా” అంటే ఏంటి అనుకుంటూ ఆలోచనలో పడింది. అడుగుదాం అనుకునే లోపే మామా అల్లుళ్ళు ఇంటి బైట మంచాలు సర్దుకున్నారు.

· · ·

Leave a thought

What did part 5 leave with you?

Thoughts wait unseen until we heart them. Hearted ones appear on the story page, newest first, under your name.