Stories › Romance › రాత్రికి చెప్తా
Part 4 of 6 · 1 minపొట్లకాయ పెరుగు పచ్చడి
తలతీసినంత పనయ్యింది లాస్యకి. సిటీ పిల్లను కొంచం ఎక్కువ చేద్దాం, అని ఊరికే చెప్పింది, కానీ అదే ఇలా ఇరికిస్తుందని అనుకోలేదు లాస్య. సినిమా “భాగవంత్ కేసరి” పెట్టి టాపిక్ డైవర్టు చేసింది. పైకి మామూలుగా కనిపిస్తున్నా, లోపల ఇబ్బంది పడుతోంది. అందరూ నిద్రకు జారుకున్నారు.
పొద్దున్నే, అందరూ కోడికూర బిరియానికి సిద్ధం అయ్యారు. మామా అల్లుళ్ళు కోసి కారం పెడుతున్నారు, తల్లి కూతుళ్ళు వండి వారుస్తున్నారు. అంతా సిద్దం చేస్కొని , బిరియాని రైతా తో వడ్డించుకొని తింటున్నారు, ఒక్క ప్రమోద్ మాత్రం పెరుగు పచ్చడి నంచుకుంటున్నాడు.
“ఏంటండీ అన్నం లో తినాల్సిన పచ్చడిని ఇలా తింటున్నారు?” అని అత్తగారు అడిగింది. లాస్య వెంటనే “అదంటే తనకి చాలా ఇష్టం, అందులో పొట్లకాయ తో చేస్తే చాలా ఇష్టం. వారానికి ఒకటి రెండు సార్లు చేయించుకుంటాడు.” అంది.
“ఎంత అదృష్టవంతులు అల్లుడు గారు మీరు. నా కూతురు అని కాదు గాని, ఇష్టాయిష్టాలు అర్థం చేసుకునే భార్య దొరికింది, నా భార్య ఉంది, పాయసం చేయామని సేమియా తెస్తే ఉప్మా చేసి, నా ఇష్టాన్ని, ఉప్మా రుచిని చంపేస్తుంది.” అన్నారు మామగారు. “ఊరుకోండి, నిజమనుకుంటారు అల్లుడుగారు. ఆ పాయసం తినే కదా డయాబెటిస్ తెచ్చుకున్నారు” వాపోయ్యింది అత్తగారు.
· · ·