
నా వెనక మనిషి
రోజూ సాయంత్రం ట్యూషన్ అయ్యాక, సరిగ్గా ఇరవై అడుగుల వెనక. అవే మలుపులు. నేను ఆగితే ఆయనా ఆగుతాడు..
ఎదురింట్లోకి కొత్తగా వచ్చినాయన రోజూ ట్యూషన్ టైముకి మెయిన్ రోడ్డు మీద టీ కొట్టులో టీ తాగుతూ కనిపిస్తాడు. ఆ తర్వాత పిల్లాడికి సరిగ్గా ఇరవై అడుగుల వెనకే నడుస్తాడు, చీకటి సందులోంచి ఇంటిదాకా. ఎప్పుడూ దగ్గరికి రాడు, ఒక్క మాట కూడా మాట్లాడడు. ఏడో రోజు ఇంక భయం తట్టుకోలేక పిల్లాడు ఏడుస్తూ ఇంటిదాకా పరిగెత్తాడు.


