
చీకట్లో పాట
అమ్మ పెళ్ళి పట్టుచీరతో నెమలి వేషం, అందరూ మర్చిపోయిన ఏడింటి కరెంటు కోత.
నాలుగో తరగతి గ్రూప్ డాన్సులో వెనక వరసలో నెమలి వేషం, దాని కోసం అమ్మ తన నీలం ఆకుపచ్చ పెళ్ళి పట్టుచీర కత్తిరించి మూడు రాత్రులు ఉషా మెషిన్ మీద కుట్టింది. యాన్యువల్ డే రోజు ఊరు ఊరంతా గ్రౌండులో ఉంది, తెర తీశారు, టేపు మొదలైంది. నర్సాపురంలో రోజూ సాయంత్రం ఏడింటికి కరెంటు పోతుంది.


