
కదిలే ఇటుక
పశువుల పాక వెనక ఒక రహస్య కన్నం, అందులో ఎవరూ పెట్టని ఒక పిప్పరమెంటు.
తెనాలి దగ్గర తాతయ్య వాళ్ళ ఊళ్ళో వేసవి సెలవులు. పశువుల పాక వెనక గోడలో కదిలే ఇటుక ఒకటి, దాని వెనక చిన్న కన్నం తొమ్మిదేళ్ళ పిల్లాడికి దొరుకుతుంది. అదే వాడి బ్యాంకు, వాడి లాకరు, వాడి రహస్యం అయిపోతుంది. కానీ కొన్నాళ్ళకి వాడు పెట్టని వస్తువులు అందులో కనిపించడం మొదలవుతాయి, ఎవరు నువ్వు అని రాసిన చీటీకి పెన్సిల్తో ఒకే ఒక్క మాట జవాబుగా వస్తుంది.


