
చింటు – బుల్లి భూతాల కథ
నల్లమల గురుకులంలో అల్లరి చేసిన ముగ్గురు శిష్యులు, ఒక ఋషి శాపం, సముద్రంలో రెండు వేల రెండు వందల ఏళ్లు. ఆ తర్వాత ఒక ఐదేళ్ల పిల్లాడు చింటు.
సర్వానంద మహర్షి గురుకులంలో ముగ్గురు అల్లరి శిష్యులు. వాళ్ల అల్లరికి విసిగిన మహర్షి శపిస్తారు: భూతాలుగా మారి, ఎవరి కంటికీ కనిపించకుండా, కలశంలో సముద్రం అడుగున ఉండాలి. కష్టంలో ఉన్న ముగ్గురు మనుషులకు సాయం చేసి సంతోషపెట్టిన రోజే శాపం తీరుతుంది. రెండు వేల రెండు వందల ఏళ్ల తర్వాత, 1990ల మధ్యలో, ఆ కలశం ఐదేళ్ల చింటు చేతికి దొరుకుతుంది.


