
మ్యాటినీ ఆట
పాల డబ్బుల్లోంచి నాలుగు రూపాయలు, చీకటి టెంటు, ఒక పక్కకి కుంగిపోయిన బెంచీ.. అంతే, కథ అక్కడే మొదలైంది.
స్కూల్లో అందరూ కొత్త చిరంజీవి సినిమా డైలాగులు చెప్పుకుంటుంటే ఎనిమిదో తరగతి పిల్లాడు ఆదివారం దాకా ఆగలేకపోయాడు. అమ్మ పాల డబ్బుల్లోంచి నాలుగు రూపాయలు తీసుకుని, లంచ్ బెల్లు కొట్టగానే టెంటు హాల్లోకి దూరిపోయాడు. చీకట్లో ఎవరో పెద్ద మనిషి వచ్చి పక్కన కూర్చున్నాడు. అదెవరో తెలిసింది మాత్రం ఇంటర్వెల్లో లైట్లు వెలిగాకే.


