Thoughting.in
ENతె
Cover for వాడి లిస్టు

Stories › Greentext

వాడి లిస్టు

ఇద్దరు బద్ధశత్రువులు, ఒక వరద, నేల మీద ఒకే దుప్పటి, డాబా మీద ఆరుతున్న ఒక పేజీ.

By Sylaja Gannavaram · 1 November 2026 · one sitting · 1 min · complete

Read it

నాకు ఎనభై ఎనిమిది వస్తే గోపీకి ఎనభై తొమ్మిది, నేను ఓడిన రేసు వాడు గెలుస్తాడు, వాడి సైకిల్‌కి గేర్లు కూడా ఉన్నాయి. మేం మాట్లాడుకునేది ఔట్, నాటౌట్ అనడానికి మాత్రమే. 2000 ఆగస్టు వానలకి వాడి వీధి మునిగిపోయింది, వాళ్ళ కుటుంబం మా ఇంటికొచ్చింది, హాల్లో మా ఇద్దరికీ కలిపి ఒకే దుప్పటి ఇచ్చారు.